Monday, September 23, 2024
HomeTrending Newsరైతు బలవన్మరణం పై డిజిపికి పిర్యాదు

రైతు బలవన్మరణం పై డిజిపికి పిర్యాదు

జగిత్యాల జిల్లా నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు గడ్డం జలపతి రెడ్డి బలవన్మరణానికి కారణమైన న్యాయవాది కొలుగూరి దామోదర్ రావు పై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి లు సోమవారం రాష్ట్ర డిజిపి అంజన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. రైతు బలవన్మరణం పై జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 4న ఎఫ్ఐఆర్ 34/2023 కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నిందితుడిని అరెస్టు చేయకుండా, విచారణ జాప్యం చేస్తున్న విషయమై డీజీపీకి వారు ఫిర్యాదు చేశారు. న్యాయవాది దామోదర్ రావు మానసిక హింస వల్లనే రైతు జలపతి రెడ్డి సూసైడ్ చేసుకున్నట్లు లేఖ రాయడంతో పాటు సెల్ఫ్ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని డిజిపికి వివరించారు.

రైతు జలపతి రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తనకున్న ఇద్దరు ఆడపిల్లలను వ్యవసాయ బావిలో పడవేసిన సంఘటన హృదయ విధారకరమని చెప్పారు. ఇంతటి సీరియస్ కేసులో జగిత్యాల పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సూసైడ్ లెటర్, వీడియో క్లిప్పింగ్ ను వారు డిజిపికి అందజేశారు. కాంగ్రెస్ శాసనసభక్షం ఇచ్చిన ఫిర్యాదుపై డిజిపి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని డిజిపి అంజన్ కుమార్ భరోసా ఇచ్చినట్టు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్