నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలకు పార్టీ చ్రేనులు సిద్దం అయ్యాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఉదయం 10 నుంచి 1 గంట వరకు సత్యాగ్రహ దీక్షలు చేయనున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని, ప్రధాన డిమాండ్ తో ఏఐసీసీ పిలుపు మేరకు దీక్షలు చేయనున్న కాంగ్రెస్.
మల్కాజిగిరి నియోజకవర్గ కేంద్రంలో మల్కాజిగిరి చౌరస్తాలో జరగనున్న సత్యాగ్రహ దీక్షలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నల్గొండలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ లు సత్య గ్రహ దీక్షలో పాల్గొంటారు.