దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అనుకుంటున్న బీజేపీ గురించి దేశప్రజలు ఆలోచించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ప్రజలు తీవ్రమైన దుఃఖంలో ఉన్నారన్నారు. ఈడి విచారణ పేరుతో సోనియా గాంధిపై రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ గాంధిభవన్ ఈ రోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న భట్టి బిజెపి వైఖరిని తూర్పురపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో… నిరాశతో యువత ఆత్మహత్య చేసుకొనే పరిస్థితుల్లో ఉందన్నారు.
ప్రభుత్వ రంగసంస్థలను తమకు కావలసిన వాళ్ళకి అమ్మేస్తున్నారని, దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భట్టి అన్నారు. ప్రజల పక్షాన ఎవరు పార్టీలు నడపకూడదని బీజేపీ అనుకొంటోందని, ఈ నిరసన దీక్ష కేవలం సోనియా, రాహుల్ కోసమే కాదు. కోట్లాది ప్రజల కోసమన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏమీ లేదని మూసేసిన కేసును మళ్ళీ ఓపెన్ చేశారన్నారు. కక్షపూరితంగా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుండి ఏవిధంగా పారద్రోలమో,అలాగే బీజేపీని కుల్చుతామన్నారు.
సోనియా ధిరోదాత్తురాలని కొనియాడిన భట్టి విక్రమార్కప్రధాని పదవిని త్యాగం చేసిన సోనియా దేశ అభ్యున్నతి కోసం పనిచేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పనిచేసేది అధికారం కోసం కాదు. సామాజిక మార్పు కోసమన్నారు. కాంగ్రెస్ పై కుట్ర పూరితంగా బీజేపీ ఈడీ నోటీసులు ఇచ్చిందని, నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ పత్రికకి కాంగ్రెస్ పార్టీ డబ్బులను అప్పుగా ఇచ్చిందని, బీజేపీ అనేది మల్టీ నేషనల్ కంపెనీ లాంటి పార్టీ అని భట్టి ఎద్దేవా చేశారు.
రాహుల్, సోనియాకి మద్దతుగా నిలిచి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపు ఇచ్చారు. మేమిద్దరం, మాకిద్దరు లాగ, మోదీ అమిత్ షా కి, అదానీ అంబానీలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులం, కార్యకర్తలం గ్రామాలకు వెళ్దామని, ఇంటిటికి వెళ్లి ప్రజలకు విషయాలను అర్థం చేయిద్దామన్నారు. హైదరాబాద్ వదిలి పల్లెలకి బయలుదేరుదామని, కాంగ్రెస్ జెండాని ప్రతి ఇంటిపై ఎగరేయడానికి కథం తొక్కుదామని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క పిలుపు ఇచ్చారు.
Also Read : వారి ఆటలు సాగనివ్వం: రేవంత్ రెడ్డి