Sunday, January 19, 2025
HomeTrending Newsఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర

అధికార పార్టీ శాసనసభ్యుడిపై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు హైదరాబాద్ లో ఈ రోజు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హత్య చేయడానికి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ వేమూరి ఎన్‌క్లేవ్‌లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తీ గురించి ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి రెండు పిస్టోళ్లు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ప్రసాద్ గౌడ్ గా బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. నిందితుడు కిల్లెడ గ్రామ మాజీ సర్పంచ్‌ లావణ్య భర్తగా నిర్ధారించారు. అతడ్ని విచారించిన పోలీసులు తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేశారనే కక్షతోనే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నట్లుగా తెలిపాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్