Monday, February 24, 2025
HomeTrending Newsనిలకడగా కరోనా కేసులు

నిలకడగా కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు కొంత తగ్గు ముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 20మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 13,265 ఉండగా దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 1,31,043 ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం డేటా విడుదల చేసింది. రికవరీ రేటు ప్రస్తుతం 98.50%, మరణాల రేటు 1.20% శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా 3.23% శాతానికి చేరిన కోవిడ్ టెస్టుల పాజిటివిటీ రేటు ఉంది.

ముంబై, ఢిల్లీ నగరాలతో పాటు ఆయా నగరాల సమీప ప్రాంతాల్లో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేరళలో కొంత కాలంగా కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని నెలల క్రితం కేరళలో కోవిడ్ కేసులు అప్డేట్ చేయకపోవటంతో తగ్గుముఖం పట్టాయని భావించారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆన్లైన్ నమోదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అప్డేట్ చేయకపోవటంతో తక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వర్షకాలం కావటంతో కరోనా వ్యాప్తి అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్