Saturday, January 18, 2025
HomeTrending Newsజూన్ ౩౦ వరకు కంటైన్మెంట్ జోన్ లు  

జూన్ ౩౦ వరకు కంటైన్మెంట్ జోన్ లు  

కోవిడ్ కంటైన్మెంట్ జోన్ లను జూన్ ౩౦ వరకు కొనసాగించాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారి చేసింది. కరోన రెండో దశ తీవ్రంగా ఉన్నందున మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోవలిసి ఉందని  కేంద్ర హోం శాఖా కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ సమాచారం పంపినట్టు భల్లా వెల్లడించారు.

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకే జూన్ 30 వ తేది వరకు  పెంచినట్టు కేంద్ర హోం శాఖ ఉత్తర్వుల్లో వివరించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ కట్టడి చర్యలు కట్టు దిట్టంగా ఉండటం తో సత్ ఫలితాలు వస్తున్నాయన్నారు.

దేశ వ్యాప్తంగా రోజు వారి కేసులు తగ్గుతున్న యాక్టివ్ కేసులు ఎక్కువగానే ఉంటున్నాయని భల్లా ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి పరిస్థుతులకు అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేఛ్చ ఉందన్నారు.

కరోన ను జయించే వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మహమ్మారి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతోందని అజయ్ భల్లా  వివరించారు. కోవిడ్ రెండో దశలో ఎప్పటికప్పుడు రూపుమారుతున్న మహమ్మారి పై ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు మరింత ముమ్మరం చేయాలని అజయ్ భల్లా కోరారు.

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్