4.6 C
New York
Tuesday, December 5, 2023

Buy now

Homeజాతీయంసుశీల్ అనుచరుడి అరెస్ట్

సుశీల్ అనుచరుడి అరెస్ట్

ఢిల్లీలో రెజ్లర్ సాగర్ హత్య కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో అరెస్టయిన రెజ్లర్ సుశీల్ కుమార్ అనుచరుడు రోహిత్ కకోర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హత్య జరిగిన సమయంలో రోహిత్ అక్కడే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

రోహిత్ తో పాటు సుశీల్ మరో అనుచరుడు వీరేంద్ర బిందర్ పై పోలీసులు ఇదివరకే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు, నేడు రోహిత్ పట్టుబడగా వీరేంద్ర ఇంకా పరారీలోనే ఉన్నాడు.

మే 4న ఢిల్లీ లోని చత్రసాల్ స్టేడియం వద్ద ఈ హత్య జరిగింది. ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. సుశీల్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండు వారాల పాటు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న సుశీల్ ను గత ఆదివారం మే 23న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  ఢిల్లీ కోర్టు సుశీల్ ను ఆరు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. విచారణలో సుశీల్ నోరు విప్పడం లేదని, మరి కొన్ని రోజులపాటు కస్టడీ పొడిగించాలని పోలీసులు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు.

మరోవైపు ఈ హత్య కేసులో మీడియా విచారణ  అపాలంటూ సుశీల్ తల్లి కమలా దేవి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు విచారణ జరుగుతుండగానే సుశీల్ దోషి అంటూ మీడియా కథనాలు ఇవ్వడం అభ్యంతరకరమని, సంచలనాత్మక రిపోర్టింగ్ పేరిట అవాస్తవాలను వెల్లడించడం దారుణమని వారు కోర్టు దృష్టికి తెచ్చారు.  దీనిపై నేడు విచారణ జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్