Saturday, November 23, 2024
HomeTrending Newsకాంటినెంటల్ ఆసుపత్రి అరాచకం

కాంటినెంటల్ ఆసుపత్రి అరాచకం

వైద్యం పేరుతో అమానవీయంగా వ్యవహరించిన హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం బాగోతం వెలుగులోకి వచ్చింది. రెండున్నర లక్షలు చెల్లిస్తే వైద్యం చేస్తామని చెప్పిన యాజమాన్యం 17 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. రోగికి వైద్యం చేయడం లేదని, కనీసం డిశ్చార్జ్ చేయకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శాంతమ్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆగస్ట్ 24 న శాంతమ్మను ఆసుపత్రిలో చేర్చగా..సర్జరీ చేసిన వైద్యులు సాధారణ వార్డుకు షిఫ్ట్ చేశారు. నాలుగు రోజుల అనంతరం కుట్ల ఊడిపోయి పేగుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడింది. ఇన్ఫెక్షన్ శరీర మొత్తం వ్యాపించడంతో రోగి పరిస్థితి విషమంగా  మారింది. ఐసీయూకి షిఫ్ట్ చేసిన వైద్యులు రెండో సారి శాస్త్ర చికిత్స చేశారు.

ఐసీయులో 12 రోజులపాటు ఉంచి వైద్యం చేసిన ఆస్పత్రి యాజమాన్యం…టెస్టులు పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసింది. రోగ పరిస్థితి విషమంగా ఉన్నా…  డబ్బులు చెల్లిస్తూనే డిశ్చార్జ్ చేస్తామంటూ మొండికేస్తున్న యాజమాన్యం వైఖరితో రోగి బంధువులు ఆందోళన చెందుతున్నారు. వైద్య చికిత్సకు రెండు లక్షల అవుతుంది అని చెప్పిన యాజమాన్యం 17 లక్షల బిల్లు వేయడంతో లబోదిపోమంటున్న బాధితులు. బిల్లు కట్టడం లేదని శాంతమ్మకు వైద్య సహాయం నిలిపివేయటంతో క్రమంగా శాంతమ్మ  ఆరోగ్యంక్షీణిస్తోంది. ఆస్పత్రి యాజమాన్యం వైఖరితో నెలరోజులుగా కుటుంబ సభ్యులు.. రోగి నరకయాతన అనుభవిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్