రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించిన ‘శేఖర్’ గత శుక్రవారం విడుదలైంది. అయితే, ఫైనాన్షియర్ పరంధామరెడ్డి వేసిన కేసు కారణంగా సినిమా ప్రదర్శన నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో జీవితా రాజశేఖర్, శేఖర్ చిత్రబృందం సభ్యులకు అనుకూలంగా కోర్టులో న్యాయమూర్తి మాట్లాడినట్టు తెలుస్తోంది. ‘శేఖర్‘ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెప్పుడూ చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
కొంత మంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారు. అయితే, కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. శేఖర్ సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు. జీవితా రాజశేఖర్, నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి తరపు న్యాయవాదులు ఈరోజు విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
Also Read : నా ‘శేఖర్’ సినిమా జోలికి వస్తే సహించేది లేదు : నిర్మాత బీరం