Covid : దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది డిశ్చార్జీ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 1881 కేసులు ఉన్నాయి. ఇందులో 1242 కేసులు ముంబైకి చెందినవేనని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కేరళలో 1494, ఢిల్లీలో 450, కర్ణాటకలో 348, హర్యానాలో 227 కేసులు ఉన్నాయి.
కాగా, రోజువారీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 0.07 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.72 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నదని తెలిపింది. ఇప్పటివరకు 1,94,43,26,416 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో మంగళవారం 14,94,086 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించింది. దీంతోపాటు జూన్ 7న 3,13,361 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఇప్పటివరకు మొత్తం 85,35,22,623 నమూనాలను పరీక్షించామని ఐసీఎమ్మార్ ప్రకటించింది.
Also Read : కేరళలో విజృంభిస్తోన్న కరోనా కేసులు