Tuesday, January 28, 2025
Homeతెలంగాణకోవిడ్ అదుపులోనే ఉంది : కేటిఆర్

కోవిడ్ అదుపులోనే ఉంది : కేటిఆర్

కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర పురపాలక మంత్రి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేటిఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కోవిడ్ అదుపులోనే ఉందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం కూడా గుర్తించిందని…కేంద్ర ఆరోగ్య మంత్రి అభినందించారని కేటిఆర్ వివరించారు. కోవిడ్ టాస్క్ ఫోర్సు మొదటి సమావేశం ఈరోజు జరిగింది.

ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కేటిఆర్. బ్లాక్ ఫంగస్ అంశంలోకూడా ప్రభుత్వం అలెర్ట్ గా ఉందని, దీనికి అవసరమైన మందులను సరఫరా చేసుకుంటున్నామని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల రెమిడిసివర్ మందుల నిల్వలు ఉన్నాయని, రాష్ట్రంలో తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయం చేస్తామన్నారు.

రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలమంది ఉన్నారని.. వీరిలో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారని చెప్పారు. వీరిలో 10 లక్షలకు పైగా జనాభా రెండు డోసుల వాక్సిన్ తీసుకున్నారని గణాంకాలు వివరించారు.

ఇంటింటి సర్వే చేస్తూ అవసరమైన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నామని, ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయిందని కేటిఆర్ వెల్లడించారు. ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ ఇచ్చామని, ఈ ప్రయత్నం వలన వేలాది మందిని కాపాడగలిగామని, కోవిడ్ లక్షణాలు రాగానే ఈ మందులు వాడడం వలన సీరియస్ కండిషన్ లో హాస్పిటల్ అవ్వాల్సిన అవసరం చాలా వరకు తగ్గిందన్న కేటిఆర్ దీని పూర్తి ఫలితాలు ఒకటి రెండు రోజుల్లో కనిపిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్