Sunday, April 20, 2025
HomeTrending Newsసిపిఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

సిపిఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం పోటీపడ్డ పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావుల ఎన్నికపై చివరి వరకు ఉత్కంట నెలకొంది. ఏకగ్రీవం కోసం పార్టీ అధిష్టానం బుజ్జగించినా నేతలు వినకపోవటంతో ఎన్నిక తప్పని సరి అయింది. పోటీలో ఇద్దరు నేతలు నిలవతంతో ఎన్నికల ప్రక్రియ నిర్వహించిన సిపిఐ అధిష్టానం.

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ స్టేట్ కౌన్సిల్ సభ్యులు. పోలైన ఓట్లు : 110, కూనంనేని సాంబశివరావు – 59, పల్లా వెంకటరెడ్డి – 44, చెల్లనివి – 07 ఓట్లు కాగా 15 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన కూనంనేని సాంబశివరావు. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహించారు. ప్రజా సమస్యలపై ధాటిగా మాట్లాడే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో పార్టీ మళ్ళీ జీవం పోసుకునే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్