Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్ఏపీ సిఎం జగన్ ను కలిసిన శ్రీకర్ భరత్ `

ఏపీ సిఎం జగన్ ను కలిసిన శ్రీకర్ భరత్ `

ఇండియన్‌ క్రికెట్‌ ప్లేయర్‌ కేఎస్‌ భరత్‌ (కోన శ్రీకర్‌ భరత్‌) తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  ఈ సందర్భంగా కేఎస్‌ భరత్‌ను జగన్ అభినందించారు.  క్రికెట్ టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి కేఎస్‌ భరత్‌ బహుకరించారు.

“జగన్‌ సార్‌ సీఎం అయిన తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కీపర్ గా వ్యవహరించడం నాకు గర్వంగా ఉంది, ఈ విషయాలు సీఎంగారితో పంచుకున్నాను. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారు, సార్‌ మీరు నాకు ఇన్స్‌పిరేషన్‌గా భావిస్తూ, ఒక క్రికెటర్‌గా మీ మద్దతు నాకు అవసరం అని చెప్పాను. సీఎంగారు కూడా దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సూచించారు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయి, అలాగే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కూడా బావుంది. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఒక క్రికెటర్‌గా చాలా బావుంది. మున్ముందు ఇలాంటి ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారు, థ్యాంక్యూ” అంటూ భరత్ తన సమావేశం వివరాలు వెల్లడించారు.

కేఎస్‌ భరత్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు మంగాదేవి, శ్రీనివాసరావు, కోచ్‌ క్రిష్ణారావు, కుటుంబ సభ్యులు, ఎంపీ పి.వి.మిథున్‌ రెడ్డి సిఎం ను కలిసిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్