CV Reddy Back: రాజీవ్ సాలూరి, దీప ప్రధాన పాత్రలో ఈ నెల 11న ‘ఆఖరి ముద్దు’ అనే చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. నిర్మాత, దర్శకుడు సి వి రెడ్డి ఓ వినూత కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీవీ ఆర్ట్స్ పై ఎనిమిది సంవత్సరాల గ్యాప్ తరువాత ఈ సినిమాను సీవి రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో ఈ సినిమా కథను తయారు చేసుకున్న సీవీ రెడ్డి దీనికి ‘ఆఖరి ముద్దు’ అనే టైటిల్ నిర్ణయించారు.
ఈ కథ తనని బాగా ప్రభావితం చేసిందని, ముఖ్యంగా సమాజానికి మార్గదర్శకం కావాలనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాను రూపొందిస్తున్నానని చెప్పారు. గతంలో సీవీ రెడ్డి తెలుగులో పది చిత్రాలు, కన్నడ, తమిళంలో అనేక చిత్రాలు నిర్మించారు. దర్శకుడుగా, రచయితగా, నిర్మాతగా విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ‘బదిలి’ అనే చిత్రం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు దక్కించుకున్నారు.
‘పెళ్లి గోల’, ‘విజయరామరాజు’, ‘శ్వేత నాగు’, ‘ఆడుతూ పడుతూ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలను సివి.రెడ్డి నిర్మించారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇండియన్ పనోరమా కమిటీ మెంబెర్ గా, ప్రతిష్టాత్మమైన ఆస్కార్ కమిటీకి చైర్మన్ గా సేవలందించారు. ‘ఆఖరి ముద్దు’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలతో పాటు, దర్శకత్వం వహిస్తూ తానే స్వయంగా నిర్మిస్తున్నారు.
Also Read : సప్తగిరి హీరోగా నూతన చిత్రం ప్రారంభం