Sunday, January 19, 2025
Homeసినిమానిఖిల్‌ను సన్మానించిన సజ్జనార్

నిఖిల్‌ను సన్మానించిన సజ్జనార్

వరస విజయాలతో జోరు మీదున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో చాలా మందికి సాయం చేసిన నిఖిల్ రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సేవలను గుర్తించిన సజ్జనార్ అతన్ని సన్మానించారు. అలాగే నిఖిల్‌లోని మానవతా దృక్పతాన్ని అయన మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

కష్ట సమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని సజ్జనార్ ప్రసంశించారు. సెకండ్ వేవ్‌లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేశారు నిఖిల్. అలాగే అవసరాలు తెలుసుకుని సాయపడ్డారు. మెడికల్ కిట్లతో పాటు కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఇలా ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి సాయపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్