Sunday, February 25, 2024
Homeస్పోర్ట్స్ఇండియా 364 ఆలౌట్ - ఇంగ్లాండ్ 119/3

ఇండియా 364 ఆలౌట్ – ఇంగ్లాండ్ 119/3

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా 364  పరుగులకు ఆలౌట్ అయ్యింది. 276 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇండియా 36 ఓవర్లపాటు ఆడి మరో 88 పరుగులు జోడించింది. రవీంద్ర జడేజా-40, రిషభ్ పంత్ 37 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ కు ఐదు వికెట్లు, ఒలీ రాబిన్సన్-2, మార్క్ వుడ్-2 వికెట్లు సాధించారు. మోయీన్ అలీ కి ఒక వికెట్ దక్కింది.

ఆ తరువాత తమ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 119  పరుగులు చేయగలిగింది. ఓపెనర్ జోసెఫ్ బర్న్స్49  పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ జో రూట్-48, జానీ బెయిర్ స్టో-6 పరుగులతోను క్రీజులో ఉన్నారు. ఇండియా బౌలర్లలో సిరాజ్ కు -2 వికెట్లు దక్కాయి, షమీ ఒక వికెట్ పడగొట్టాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్