Sunday, November 24, 2024
HomeTrending NewsCyclone Gulab : తెలుగు రాష్ట్రాలకు గులాబ్ తుఫాన్ హెచ్చరిక

Cyclone Gulab : తెలుగు రాష్ట్రాలకు గులాబ్ తుఫాన్ హెచ్చరిక

తెలంగాణలో నిన్నటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన పడింది. వడగళ్ళ వానకు వికారాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ఈ రోజు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రాత్రి నుంచి హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వాన పడింది. ఈ రోజు ఉదయం వరకు మేఘావృతమైన భాగ్య నగరంలో చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి.

మరోవైపు  భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమైన గులాబ్ తుఫాన్…మరి కొన్ని గంటలలో తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గులాబ్ తుఫాన్…ప్రస్తుతం చర్ల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ కు 65 కి. మీ, తెలంగాణలోని భద్రాచలానికి 120 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి)పేర్కొంది.

రానున్న 24 గంటల్లో తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారనుంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతోపాటు రాయలసీమ తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.

Also Read : కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో వడగళ్ల వర్షం

RELATED ARTICLES

Most Popular

న్యూస్