Sunday, January 19, 2025
HomeTrending Newsకారు కెసిఆర్ ది.. డ్రైవర్ రజాకార్

కారు కెసిఆర్ ది.. డ్రైవర్ రజాకార్

సంజయ్ చేసేది పాదయాత్ర కాదు. కేసీఆర్ మీద దండయాత్ర అని బీజేవైఎం జాతీయ అధ్యక్షులు, బెంగళూరు ఎంపీ తేజస్వీ సూర్య అన్నారు. తెలంగాణలో నయా నిజాం, గడీల పాలనను చూస్తున్నం. కేసీఆర్, టీఆర్ఎస్ కార్యకర్తల గుండెల్లో ప్రజా సంగ్రామ యాత్రను చూసి భయం పట్టుకుంది. బీజేపీ చేస్తున్న ధర్మ యుద్దంలో ప్రతి ఒక్కరం విజయం సాధించి తీరుతామన్నారు. సంగారెడ్డిలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ తేజస్వి సూర్య పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారు.

తేజస్వి సూర్య ప్రసంగం ఆయన మాటల్లోనే …

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. అన్నీ పచ్చి అబద్దాలు చెబుతున్నారు. ఉద్యోగాల భర్తీ లేదు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తానన్నడు ఇచ్చారా? డబుల్ బెడ్రూం ఇండ్లు అన్నడు. ఇచ్చాడా? కేసీఆర్ ఝూటా సర్కార్. పచ్చి అబద్దాల ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడమే యువ మోర్చా లక్ష్యంగా పనిచేస్తుంది. యువ మోర్చా కార్యకర్తలంటేనే టీఆర్ఎస్ భయపడుతోంది. యువ మోర్చా అధ్యక్షులు భాను ప్రకాశ్ పై తప్పుడు కేసులు పెట్టింది. టీఆర్ఎస్ గూండాలు పెట్టే కేసులకు యువ మోర్చా భయపడదు. మేం విజయం సాధిస్తాం. టీఆర్ఎస్ సర్కార్ దేశద్రోహ పార్టీ ఎంఐఎం కు మద్దతిస్తోంది. కారు టీఆర్ఎస్ దే…స్టీరింగ్ డ్రైవర్ మాత్రం రజాకార్ నడిపిస్తుండు. రజకార్ రాజ్యాన్ని కూకుటివేళ్లతో కూల్చేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నం.
దేశం మొత్తం ప్రధానివైపు చూస్తోంది. దేశవ్యాప్తంగా అనేక అభివ్రుద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నరు. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత యువ మోర్చా కార్యకర్తలు, ప్రజలపై ఉంది. టీఆర్ఎస్ అవినీతి, నియంత కుటుంబ పాలనకు అడ్డుకట్ట వేయాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను వదిలి కేసీఆర్ కుటుంబంలోని నలుగురి ఆకాంక్షలకే పెద్దపీట వేస్తున్నరు.
ఎన్నికలప్పుడు కేసీఆర్ నినాదం నీళ్లు-నిధులు-నియామకాలు. ఇప్పుడు కన్నీళ్లు-అప్పులు-నిరుద్యోగ ఆత్మహత్యలు…ఇదే నేటి తెలంగాణ స్థితి. దీన్ని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. సంజయ్ ఆద్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలి. ఇంటింటికీ మోదీ పథకాలను తీసుకెళ్లాలి. టీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉంది. 2023 ఎన్నికలయ్యే దాకా యువ మోర్చా కార్యకర్తలు, ప్రజలు విరామం తీసుకోకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలి.

ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రి బాబూమోహన్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, నందీశ్వర్ గౌడ్, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ మనోహర్ రెడ్డి, సహ ప్రముఖ్ లు తూళ్ల వీరేందర్ గౌడ్, లంకల దీపక్ రెడ్డి, ఎస్సీ, బీసీ, మహిళా, యువ మోర్చా అధ్యక్షులు కొప్పు భాష, ఆలె భాస్కర్, గీతామూర్తి, భాను ప్రకాశ్, జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్