Rishikonda Temple: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశాఖ నగరం రుషికొండపై రూపుదిద్దుకున్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిన్నటి నంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రుషికొండలో సముద్రానికి అభిముఖంగా కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవాలు ఈ నెల 18న అంకురార్పణతో మొదలయ్యాయి.
ఐదు రోజులు యజ్ఞయాగాదులు నిర్వహించి నిన్న బుధవారం మహాకుంభాభిషేకం నిర్వహించారు. విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనతరం నిన్న సాయంత్రం శ్రీనివాసకల్యాణ మహోత్సవం కూడా జరిగింది. నిన్నటి నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.