ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 386 పరుగులు చేసి 197 పరుగుల ఆధిక్యం సంపాదించింది. లబుషేన్ 14 పరుగులు చేసి అవుట్ కాగా, స్టీవెన్ స్మిత్ 85 రన్స్ సాధించి సెంచరీ కి దగ్గరలో ఔటయ్యాడు.
ఈ మ్యాచ్ తో వందో టెస్టు ఆడుతోన్న డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీ సాధించాడు. సరిగ్గా 200 పరుగులు చేసిన వార్నర్ ఆ ఆనందంలో జంప్ చేసినపుడు కాలు బెణకడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. కామెరూన్ గ్రీన్ కూడా రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరగాల్సి వచ్చింది. నార్త్జ్ బౌలింగ్ లో బంతి వేగంగా గ్రీన్ గ్లోవ్స్ ను తాకడంతో వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్-48; అలెక్స్ క్యారీ-9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
వందో టెస్టులో సెంచరీ చేసిన పదో ఆటగాడిగా, డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా వార్నర్ తన పేరిట సరికొత్త రికార్డు లిఖించుకున్నాడు. గతంలో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ మాత్రమే వందో టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు.