Saturday, September 21, 2024
HomeTrending Newsఈ నెలాఖరు వరకు రుణమాఫీ ప్రక్రియ

ఈ నెలాఖరు వరకు రుణమాఫీ ప్రక్రియ

ప్రకృతిని కాపాడుకుందాం, అది మనను కాపాడుతుందని, మానవాళి ఆలోచనా తీరు మారాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రకృతిని, ప్రకృతిలోని జీవరాశులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. చెట్లు, మొక్కల పెంపకం మీద ప్రజల ఆలోచన తీరు క్రమంగా మారుతోందని, వృక్షో రక్షతి రక్షితహ అన్నది అందరూ గుర్తుంచుకోవాలన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉద్యానశాఖ నిర్వహిస్తున్న నర్సరీమేళాకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. రాష్ట్రంలో పచ్చదనం శాతం పెరిగింది, మ్యాన్ మేడ్ ఫారెస్టుల నిర్మాణంలో మనం ముందున్నామని మంత్రి వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆరో రోజు రూ.63.05 కోట్లు, 20,663 మంది రైతుల ఖాతాలలో రుణమాఫీ నిధులు జమ అయ్యాయని మంత్రి వెల్లడించారు. మొత్తం నేటి వరకు 94,695 మంది రైతుల ఖాతాలలో రూ.275.31 కోట్లు జమ కాగా ఈ నెల 30 వరకు 6.08 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని చెప్పారు. కరోనా విపత్తులో ప్రపంచం విలవిలలాడుతుంటే ధైర్యంగా వ్యవసాయం చేసి ప్రపంచానికి ఆహారం అందించింది అన్నదాతలే అని అరక దున్నే రైతన్న ఆర్థిక స్థిరత్వం సాధించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగు మీద రైతాంగం దృష్టి సారించాలని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతాంగానికి పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్