Sure Entertainment: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఎఫ్ 3‘. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎఫ్ 3 ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం విశేషాలని మీడియాతో పంచుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ.. విశేషాలు ఆయన మాటల్లోనే…
“సీక్వెల్ ఫ్రాంచైజీ కాబట్టి కొత్తవారిని పెడితే ఎఫ్ 2 ఫ్రాంచైజీ ఫీల్ రాదు. ఎఫ్ 2 ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ తో కొత్త కథ చెప్పాం. ఎఫ్ 2లో భార్యభర్తల ఫస్ట్రేషన్ వుంటే ఎఫ్ 3లో మనీ ఫస్ట్రేషన్. ఇది ఇంకా కనెక్ట్ అయ్యే పాయింట్. డబ్బు చుట్టూ వుండే ఆశ అత్యాశ, కుట్ర, మోసం ఇవన్నీ హిలేరియస్ గా వర్క్ అవుట్ అయ్యాయి. ఎఫ్ 2 సక్సెస్ తో ఆర్టిస్టులందరూ మంచి ఎనర్జీతో పని చేశారు. సునీల్, మురళీ శర్మ, అలీ….ఇలా కొంత మంది ఆర్టిస్ట్ లు కొత్తగా యాడ్ అయ్యారు. మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫన్ గా వుంటుంది ఎఫ్ 3.
ఎఫ్ 2 నుండి ఎఫ్ 3కి వచ్చేసరికి అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగా వుంటాయి. ఫన్ డోస్ పెంచడానికి ఎలిమెంట్స్ ఎక్కువ వుంటే ఇంకా ఎక్కువ చేయగలం. మామూలు పాత్రతో చేసేకంటే ఇలాంటి పాత్రలతో ఎక్కువ ఫన్ చేయొచ్చనిపించి ఈ క్యారెక్టరైజేషన్స్ యాడ్ చేశాం. ఐతే అవే క్యారెక్టరైజేషన్స్ ప్రధానంగా సినిమా వుండదు. నైట్ సీన్స్ వచ్చినపుడు ఆ ఫన్ వాడుకుంటాం, వరుణ్ నత్తి మీరు ట్రైలర్ లో చూసే వుంటారు. అది కేవలం ట్రైలర్ మాత్రమే. సినిమా దాదాపు ముఫ్ఫై చోట్ల ఆ మేనరిజం వచ్చింది. ప్రతిసారి కొత్తగా వుంటుంది. ఇది నిజంగా ఛాలెజింగ్ అనిపించింది. మాట అడ్డుపడినప్పుడల్లా కొత్త మ్యానరిజం చేయాలి. అనుకున్నపుడు ఈజీగా అనిపించింది కానీ ప్రాక్టికల్ గా ప్రతిసారి కొత్త మ్యానరిజం అంటే సీన్ కంటే ఎలాంటి మ్యానరిజం ఇవ్వాలనే ఒత్తిడి ఎక్కువ వుండేది.
పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత పూజా యాడ్ అయింది. ముగ్గురు హీరోయిన్స్ తో ‘ఊ హ ఆహా ఆహా’ పాటని తీశాం, తర్వాత వచ్చే సెలబ్రేషన్స్ పాట కొంచెం స్పెషల్ గా వుండాలని ఒక స్టార్ హీరోయిన్ గెస్ట్ గా వస్తే బావుంటుదని భావించాం. కథలోనే పూజ హెగ్డే గా వస్తుంది తను. టోటల్ గా సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.