Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఢిల్లీ ఓటమి; ప్లే ఆఫ్ కు బెంగుళూరు

ఢిల్లీ ఓటమి; ప్లే ఆఫ్ కు బెంగుళూరు

Delhi Out: ప్లే ఆఫ్ చేరాలన్న ఢిల్లీ కల నెరవేరలేదు. ముంబయి ఇండియన్స్ తో నేడు జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ ఐదు వికెట్లతో ఓటమి పాలైంది. దీనీతో బెంగుళూరు నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇషాన్ కిషన్ 48; డేవాల్డ్ బ్రేవీస్  37;  టీం డేవిడ్ 11 బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో 34 పరుగులతో రాణించి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించారు.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీలో రోమన్ పావెల్-43 ; కెప్టెన్ పంత్-39; ఓపెనర్ పృథ్వీ షా-24 …మాత్రమే రాణించారు, చివర్లో అక్షర్ పటేల్  10 బంతుల్లో రెండు సిక్సర్లతో 19 పరుగులు చేయడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159పరుగులు చేసింది.

ముంబై బౌలర్లో బుమ్రా మూడు, రమన్ దీప్ సింగ్ రెండు; డానియెల్ శామ్స్, మయాంక్ మార్కండే చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ముంబై 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, నార్త్జ్ చెరో రెండు; కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

మూడు వికెట్లు సాధించిన ముంబై బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా కు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

Also Read :రేసులో నిలిచిన బెంగుళూరు: గుజరాత్ పై గెలుపు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్