Dengue Outbreak In Ghaziabad :
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో డెంగ్యు కేసులు తామరతంపరగా పెరుగుతున్నాయి. ఒకే రోజు 30 కేసులు రావటంతో ఆరోగ్య శాఖ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ నెలలోనే కేవలం ఘజియాబాద్ లో ఇప్పటివరకు సుమారు ఆరు వందల కేసులు నమోదుకాగా తాజా కేసులను కలుపుకుంటే జిల్లాలో 860 డెంగ్యు కేసులు వెలుగు చూశాయి. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఘజియాబాద్ పరిశ్రమలు, ఐ.టి. తదితర వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెంది నగరం అంతర్జాతీయ రూపు రేఖలు సంతరించుకుంది. అయితే ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు కోసం వస్తున్న వలస జీవులతో మురికివాడలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో మౌలిక సదుపాయాలు కల్పించటం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.
Must Read : ఉత్తరప్రదేశ్లో 40 శాతం టికెట్లు మహిళలకే – కాంగ్రెస్