Saturday, January 18, 2025
HomeసినిమాSamyukta Menon: ‘డెవిల్’ సంయుక్త మీనన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Samyukta Menon: ‘డెవిల్’ సంయుక్త మీనన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.  శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి మాట‌లు, స్క్రీన్ ప్లే, క‌థ‌ను అందించారు. ఈ మూవీలో క‌ళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో డెవిల్ సినిమాను  న‌వంబ‌ర్ 24న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా డెవిల్ చిత్రంలో సంయుక్త పోషించిన నైష‌ధ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

పోస్ట‌ర్‌ను గమనిస్తే.. కొబ్బ‌రికాయ‌, పువ్వులు అన్నింటినీ తీసుకుని గుడిలో పూజకు వెళుతున్న అమ్మాయిగా ప్లెజంట్‌ లుక్‌లో సంయుక్త ఆకట్టుకుంటోంది. ‘డెవిల్’ చిత్రంలో ఎవ‌రికీ అంతు చిక్క‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఆయ‌న ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆక‌ట్టుకోబోతున్నారు.దేవాన్ష్ నామా స‌మ‌ర్ప‌కుడిగా.. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీత సార‌థ్యం వ‌హిస్తుండ‌గా సౌంద‌ర్ రాజ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్