Wednesday, September 25, 2024
HomeTrending Newsరాజాపై చర్యలు తీసుకోవాలి: దేవినేని

రాజాపై చర్యలు తీసుకోవాలి: దేవినేని

Take Action: ఇరిగేషన్ ఏఈ పై చేయి చేసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని  టిడిపి నేత దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సీనియర్ అధికారులు, ఇద్దరు మంత్రుల సమక్షంలో ఈ దాడి జరగడంపైఇరిగేషన్ మంత్రి అంబటి, సిఎం జగన్ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.

పవర్ ప్రాజెక్ట్ పనులను కొట్టేయడానికే సిఎం జగన్ పోలవరం పనులను రివర్స్ టెండరింగ్ పేరిట నిలిపివేయడం చారిత్రిక తప్పిదమని దేవినేని విమర్శించారు.  పోలవరంపై ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని, నిన్న ఈ విషయాన్ని అంబటి స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. గోదావరిపై పులిచింతల ప్రాజెక్టు కడతామన్న వ్యక్తి మనకు జలవనరుల శాఖ మంత్రి ఉండడం మన దురదృష్టకరమన్నారు.

తమ పాలనలో 11, 537 కోట్ల రూపాయ పనులు జరిగాయని, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ  ఈ మూడేళ్ళలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. 50లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఈ జాతికి సిఎం జగన్ సమాధానం చెప్పాలని ఉమా అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత  పోలవరం ప్రాజెక్టుకు రూ. 4 వేల కోట్ల రూపాయలు వస్తే వాటిని  నిర్వాసితులకు ఇవ్వకుండా లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చారని ఆరోపించారు. తాము ప్రాజెక్టు పనులను 71 శాతం పూర్తి చేస్తే, ఈ ప్రభుత్వం ఎంత శాతం పూర్తి చేసిందో, నిర్వాసితులకు ఎంత ఖర్చు పెట్టిందో  చెప్పాలన్నారు.

దేశంలో 16జాతీయ ప్రాజెక్టుల్లో పోలవరం కు బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టుగా 2018లో తమ ప్రభుత్వానికి అవార్డు ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం ప్రాజెక్టుకు ఈ పరిస్తితి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : పోలవరంపై శ్రద్ధ లేదు: దేవినేని ఆరోపణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్