Sunday, January 19, 2025
Homeసినిమాధనుష్, సందీప్ కిషన్ 'కెప్టెన్ మిల్లర్‌` ప్రారంభం

ధనుష్, సందీప్ కిషన్ ‘కెప్టెన్ మిల్లర్‌` ప్రారంభం

ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నసినిమా ‘కెప్టెన్ మిల్లర్’ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా చెన్నైలో ప్రారంభ‌మ‌యింది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న వెర్స‌టైల్ న‌టుడు సందీప్ కిషన్, ధనుష్ సరసన న‌టించ‌నున్న బ్యూటీఫుల్ నాయిక‌ ప్రియాంక మోహన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సినిమా ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రారంభానికి ముందు నుంచి వ‌స్తున్న అప్‌డేట్‌తో టీమ్ భారీ అంచనాలను నెలకొల్పింది. 1930-40ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ని సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సమర్పణలో జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

బాహుబలి ఫ్రాంచైజీ, RRR,  పుష్ప వంటి చిత్రాలకు పని చేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు.  జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం, శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ, నాగూరన్ ఎడిటింగ్‌ అందిస్తుండగా టి. రామలింగం ఆర్ట్ డైరెక్టర్.గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Also Read : ‘కెప్టెన్ మిల్లర్’ కథానాయికగా ప్రియాంక మోహన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్