Sunday, January 19, 2025
Homeసినిమాఓజీ స్టోరీ ముందు మరో స్టార్ హీరో దగ్గరకి వెళ్లిందా..?

ఓజీ స్టోరీ ముందు మరో స్టార్ హీరో దగ్గరకి వెళ్లిందా..?

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. అదే.. ‘ఓజీ’. ఓరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్ధమని ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో చాలా గ్రాండ్ గా ప్రారంభించారు. రన్ రాజా రన్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్.. ఆతర్వాత రెండో సినిమాకే ఏకంగా ప్రభాస్ తో సాహో అనే భారీ యాక్షన్ మూవీ చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయినా.. బాలీవుడ్ ఆడియన్స్ ని మాత్రం ఆకట్టుకుంది.

సాహో తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న సుజిత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ తో ఓజీ మూవీని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 35 రోజులు డేట్స్ ఇచ్చారని సమాచారం. మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నారట. ఇదిలా ఉంటే.. ఈ సినిమా స్టోరీ పవన్ కంటే ముందు ఓ స్టార్ హీరో కి వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు… సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏమైందో తెలియదు కానీ ఈ సినిమాకు మహేష్ బాబు నో చెప్పినట్టు సమాచారం.

ఏ కారణాలతో రిజెక్ట్ చేశాడో తెలియదు కానీ… ఈ స్టోరీని పవన్ ఒకే చేశాడు. అదే ఓజీ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది.గ్యాంగ్ స్టర్ కథాంశంతో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. ఇక సుజిత్ జెట్ స్పీడ్ ఫినిష్ చేసేలా ప్లాన్ సెట్ చేసుకున్న తరువాతనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడుగా జరుగుతుంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి.. సుజిత్.. సాహోతో సాధించలేకపోయిన బ్లాక్ బస్టర్ ఈ మూవీతో సాధిస్తాడేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్