కాంగ్రెస్ పార్టీలో అందరూ పార్టీ నిబంధనల మేరకే పని చేయాలని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడండి అని చెప్పారు. ఇటీవల పార్టీలో పెరిగిన అంతః కలహాల నేపథ్యంలో… నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు దిగ్విజయ హైదరాబాద్ వచ్చారు. ఈ రోజు పార్టీ నేతలతో సమావేశమైన దిగ్విజయ్… ఒకరిపై ఒకరు బహిరంగ ఆరోపణలు చేయవద్దని తెగేసి చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న…మరో మారు ఇలాంటివి పునరావృతం కావొద్దన్నారు. అలా జరిగితే ఎంత పెద్ద నాయకుడి పైన చర్యలు తీసుకుంటామన్నారు. సీనియారిటీ కాదు పనితీరు తోటే పార్టీ ముందుకు పోతుందన్నారు. YSR ..34 ఏండ్లకే పీసీసీ అధ్యక్షుడు అయ్యాడని, నేను కూడా 38 ఏండ్లకే పీసీసీ పదవి చేపట్టానని తెలిపారు. సీఎం లతో కలుపుకుని పని చేశామని, సక్సెస్ అయ్యామన్నారు.
రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపితో ప్రజలు విసిగిపోయారని, కెసిఆర్ పాలన మీద పోరాటానికి సిద్ధం అవ్వాలని దిగ్విజయ్ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు అంతా ప్రజల దగ్గర కి వెళ్ళాలని, పీసీసీ మార్పు.. ఇంచార్జి మార్పు నా పరిధి అంశం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి పని చేయాలన్నారు. నాయకులు పార్టీ లైన్ లో పని చేయాలన్నారు. మోడీ నోట్ల రద్దు సామాన్య, మధ్య తరగతిని సమస్యల్లోకి నెట్టిందని, సీబీఐ, ed లతో తప్పుడు కేసులు పెడుతోంది మోడీ ప్రభుత్వమని విమర్శించారు. న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో పెరిగిపోతున్న విద్వేషాలపై జొడో యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ అని ప్రజల నుండి భారీ స్పందన వస్తుందన్నారు. భారత్ జోడో యాత్ర పూర్తి కాగానే ప్రతి గ్రామం కి వెళ్లేలా ఏఐసీసీ కార్యాచరణ సిద్ధం చేసిందని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు.