Sunday, January 19, 2025
Homeసినిమామెగాస్టార్ తో దిల్ రాజు సినిమా?

మెగాస్టార్ తో దిల్ రాజు సినిమా?

Mega Dil: మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబ‌ర్ 150 త‌ర్వాత వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. రీ ఎంట్రీలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పై ఎక్కువుగా సినిమాలు చేస్తున్న చిరంజీవి గీతా ఆర్ట్స్ కు కూడా ఇంకా అవ‌కాశం ఇవ్వ‌లేదు. అయితే.. దిల్ రాజు ఎప్ప‌టి నుంచో చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటున్నారు. దిల్ రాజు ప్రొడ్యూస‌ర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న టైమ్ లో చిరంజీవి రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్లో ప్రాజెక్ట్ సెట్ కాలేదు.

ఇన్నాళ్లు వెయిట్ చేసిన దిల్ రాజు ఇక లాభం లేదనుకుని రంగంలోకి దిగేసారు. ఏకంగా చిరంజీవి కోసం ఆరు కథలు పట్టుకుని ఆయన చుట్టూ తిరుగుతున్నార‌ట‌. ఇప్పటికే చిరంజీవి షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ.. 2024 వరకూ క్యాలెండర్ ఫుల్ అయినప్పటికీ.. వదిలేదే లేదని దిల్ రాజు భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే  ఆరు కథల్ని సిద్దం చేయించి వాటిని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లారట.

ఖాళీ సమయంలో కథలు చదవమని కథా పేపర్లని చిరు చేతుల్లో పెట్టి వచ్చారట. వాటిలో ఏది నచ్చితే ఆ కథని డెవలెప్ చేసి వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలన్నది దిల్  రాజు ప్లాన్ గా కనిపిస్తుంది. మరి.. చిరంజీవి, దిల్ రాజు కాంబో మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్