Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్ కోసం చరణ్ త్యాగం?

విజయ్ కోసం చరణ్ త్యాగం?

Vijay first: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇది చ‌ర‌ణ్ 15వ చిత్రం కాగా.. దిల్ రాజు 50వ చిత్రం కావ‌డం విశేషం. అందుక‌నే.. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ న‌టిస్తోంది. శ్రీకాంత్, సునీల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నామ‌ని దిల్ రాజు గ‌తంలో ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉంటే.. ఇక తమిళ హీరో విజయ్ నటిస్తున్న 66వ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది విజయ్ కు ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే.. విజయ్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి 2023 సంక్రాంతికి విడుదల చేయాలని.. చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీని సంక్రాంతికి కాకుండా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని స‌మాచారం. అయితే.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త నిజ‌మేనా..?   కాదా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్