Saturday, January 18, 2025
Homeసినిమాకేజీఎఫ్ హీరోతో దిల్ రాజు మూవీ. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

కేజీఎఫ్ హీరోతో దిల్ రాజు మూవీ. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

Yash-Dil: కేజీఎఫ్ ఓ సంచ‌ల‌నం. కేజీఎఫ్ 2 అంత‌కు మించి.. సంచ‌ల‌నం. ఈ సినిమాల‌తో హీరో య‌ష్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ పేర్లు మారుమ్రోగిపోయాయి. కేజీఎఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ తో స‌లార్ చిత్రం చేస్తున్నారు. మ‌రి.. య‌ష్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అంటే ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గానే ఉంది. అయితే.. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు కేజీఎఫ్ హీరో య‌ష్ తో ఓ భారీ చిత్రం ప్లాన్ చేస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

దిల్ రాజు.. కోలీవుడ్ హీరో విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. అలాగే రామ్ చ‌ర‌ణ్‌, శంకర్  కాంబినేషన్ లో మరో భారీ చిత్రం చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఇంద్రగంటి మోహ‌న్ కృష్ణ కాంబినేష‌న్లో భారీ చిత్రం ప్లానింగ్ లో వుంది. ఇప్పుడు కేజిఎప్ 2 తో సంచలనాలు నమోదు చేసిన హీరో యష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు అన్నది ఇంకా ఖ‌రారు కాలేదు.

డైరెక్ట‌ర్ ఎవ‌రు అనేది క్లారిటీ వ‌చ్చిన త‌ర్వాత ఈ సినిమాని ప్ర‌క‌టిస్తారు. ఈ సినిమా చాలా భారీగా పాన్ ఇండియా లెవెల్ లో  ప్లాన్ చేస్తున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశార‌ని తెలిసింది. మ‌రి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : దిల్ రాజు న‌మ్మ‌కం నిజ‌మౌతుందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్