Sunday, January 19, 2025
HomeసినిమాPrabhas: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో మరో మూవీ

Prabhas: ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో మరో మూవీ

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘సలార్’ రూపొందుతోంది. శృతి హాసన్  హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాపై మొదటినుంచీ భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ లుక్ తరువాత మూవీ విడుదల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న సలార్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సలార్ తర్వాత ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో మరో సినిమా రానుందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ఓ ఇంటర్ వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ… సలార్ కాంబోలో ఓ పౌరాణిక చిత్రం రానుందని.. దీనికి సంబంధించి స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందన్నారు. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నారు.  దీని తర్వాతా తమ సినిమా సెట్స్ పైకి వస్తుందని దిల్ రాజు చెప్పారు. గతంలో ప్రభాస్ తో  మున్నా, మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలు దిల్ రాజు నిర్మించారు. ఇప్పుడు మూడవ చిత్రంగా పౌరాణిక చిత్రం నిర్మిస్తుండడం విశేషం.

బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు కానీ.. సెట్ కాలేదు. ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. అయితే.. ఈ భారీ, క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్