Sunday, January 19, 2025
HomeసినిమాDimple Hayathi: హిట్ కోసం వెయిట్ చేస్తున్న డింపుల్!

Dimple Hayathi: హిట్ కోసం వెయిట్ చేస్తున్న డింపుల్!

టాలీవుడ్ తెరపై అందాల సందడి చేస్తున్న భామల్లో ‘డింపుల్ హయతి’ ఒకరుగా కనిపిస్తుంది. డింపుల్ ఏ కేరళ నుంచో .. కన్నడ నుంచొ రంగంలోకి దిగిందనుకుంటే పొరపాటే. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి .. విజయవాడ బ్యూటీ. డింపుల్ పేరు ఇటీవల కాలంలోనే వినిపిస్తున్నప్పటికీ, ఆమె తెలుగు తెరపైకి దూసుకొచ్చి ఐదేళ్లకిపైనే అయింది. ‘గల్ఫ్’ అనే ఒక చిన్న సినిమాతో ఆమె నటన దిశగా అడుగులు వేసింది. ఇక అప్పటి నుంచి ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ ముందుకు వెళుతోంది.

తెలుగుతో పాటు కోలీవుడ్ లోను కుదురుకోవడానికి ట్రై చేస్తూ వచ్చిన ఆమెకి, ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో చేసిన ఐటమ్ నెంబర్ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమానే ఆమెకి రవితేజ  ‘ఖిలాడీ’ సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆమె ఒక రెంజ్ లో అందాలు ఆరబోసింది. ఈ సినిమా హిట్ అయితే లెక్క వేరుగా ఉండేది. కానీ ఆశించిన స్థాయిని అందుకోలేకపోయిన ఈ సినిమా చతికిలపడింది.

అప్పటి నుంచి సరైన ఛాన్స్ కోసం డింపుల్ వెయిట్ చేస్తూ వెళుతోంది. మొత్తానికి ‘రామబాణం’ సినిమాలో ప్రధాన కథానాయికగా అవకాశాన్ని దక్కించుకుంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. రెండు హిట్ల తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. అందువలన మే 5వ తేదీన రానున్న ఈ సినిమాపై డింపుల్ గట్టి ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే, డింపుల్ జోరు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్