Sunday, November 24, 2024
Homeసినిమా'బ్రో' వివాదం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

‘బ్రో’ వివాదం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రినివాస్.. ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – డైలాగ్స్ రాస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఈ సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 28న భారీ అంచనాలతో బ్రో సినిమా రిలీజైంది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు వచ్చినప్పటికీ బ్రో చిత్రానికి భారీగానే ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే.. ఈ సినిమా సినిమా పై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారమే చెలరేగింది. విషయం ఏంటంటే.. ఈ సినిమాలో శ్యామ్ బాబు క్యారెక్టర్ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశించే పెట్టారని వైసీపీ శ్రేణులు ఫైర్ అయ్యారు.

మంత్రి అంబటి రాంబాబు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పవన్ కళ్యాణ్ పై విమర్శించారు. దీంతో బ్రో సినిమా పై మరింత చర్చ జరిగింది. అయితే ఈ వివాదం పై దర్శకుడు సముద్రఖని స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. స్క్రిప్ట్ మేరకే శ్యామ్ బాబు క్యారెక్టర్‌ను తీర్చిదిద్దామని, ఎవరినో కించపరచాలని ఆ సన్నివేశాలను చిత్రీకరించలేదని తెలిపారు. దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని కోరుతున్నారు. ఇక ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్‌ వారియర్ లు ఫీమేల్ లీడ్ లో నటించారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు. ఈ భారీ, క్రేజీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలీటీతో నిర్మించింది. ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 100 కోట్లకు పైగా జరిగింది. దీంతో 100 కోట్ల టార్గెట్ తో బ్రో థియేటర్లోకి వచ్చింది. మూడు రోజులు కలెక్షన్స్ బాగానే వచ్చాయి. సోమవారం నుంచి కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయి..? 100 కోట్ల టార్గెట్ ను రీచ్ అవుతుందా..? లేదా.? అనేది ఆసక్తిగా మారింది. మరి.. బ్రో ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్