Sunday, January 19, 2025
Homeసినిమా'గేమ్ ఛేంజర్' అప్ డేట్ ఇచ్చిన శంకర్

‘గేమ్ ఛేంజర్’ అప్ డేట్ ఇచ్చిన శంకర్

రామ్ చరణ్ చేస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్‘. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరిగింది. అయితే.. అనుకోకుండా ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్ చేయాల్సి రావడంతో గేమ్ ఛేంజర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఒక నెల ఇండియన్ 2 షూటింగ్, మరో నెల గేమ్ ఛేంజర్ షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ.. కుదరలేదు.

దీంతో శంకర్ ఇండియన్ 2 షూటింగ్ లోనే బిజీగా ఉంటున్నారు కానీ.. గేమ్ ఛేంజర్ గురించి పట్టించుకోవడం లేదు అనే ఫీలింగ్ మెగా ఫ్యాన్స్ కు కలిగింది. ఇటీవల ఓ మెగా ఫ్యాన్ గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటానని కూడా ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ లేఖ వైరల్ అయ్యింది. సెప్టెంబర్ నెలాఖరున చేయాలి అనుకున్న షూటింగ్ కొన్ని కారణాల వలన అక్టోబర్ నెలకి వాయిదా పడింది. ఇలా గేమ్ ఛేంజర్ షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది.

అయితే.. ఇండియన్ 2 డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయ్యిందని శంకర్ ఓ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ఇండియన్ 2 అప్ డేట్ ఇచ్చారు బాగానే ఉంది కానీ.. గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ నెటిజన్లు పోస్ట్ పెట్టడం ఆసక్తిగా మారింది. దీంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ అప్ డేట్ కూడా ఇచ్చారు శంకర్. ఇంతకీ ఏమన్నారంటే.. చరణ్‌, అంజలి పై ఎమోషనల్ సీన్స్ హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నామని తెలియచేశారు. ఓ ఫోటో కూడా పోస్ట్ చేశారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీని 2024లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ మళ్లీ ఆగిందా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్