Sunday, January 19, 2025
Homeసినిమాయంగ్ టైగర్ తో శంకర్?

యంగ్ టైగర్ తో శంకర్?

Gentlemen Combo: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఆత‌ర్వాత ఎన్టీఆర్ కేజీఎఫ్ 2 డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్నారు. అలాగే ఉప్పెన డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో కూడా ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు.

అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్, శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. చ‌ర‌ణ్ తో శంక‌ర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో శంకర్ తన దగ్గర ఓ స్టోరీ లైన్ ఉందంటూ చరణ్ కి వినిపించాడట. ఈ కథకి ఎన్టీఆర్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడట‌. ఆ లైన్ విన్న చరణ్ కూడా అదే ఫీల్ అయ్యాడట‌.

ఆత‌ర్వాత చ‌ర‌ణ్‌ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ఎన్టీఆర్ కి విషయం చెప్పి శంకర్ ను కలిపాడట. శంకర్ చెప్పిన స్టోరీ లైన్ పట్ల ఎన్టీఆర్ కూడా ఇంట్ర‌స్ట్ చూపించాడ‌ట‌. అయితే.. శంక‌ర్ చేతిలో చ‌ర‌ణ్ తో చేస్తున్న సినిమాతో పాటు ఇండియన్ 2, అపరిచితుడు హిందీ రీమేక్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాల తర్వాత‌ ఎన్టీఆర్ తో శంక‌ర్ సినిమా ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్