Tuesday, September 17, 2024
HomeTrending NewsBharat-USA: బైడెన్‌ - మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు

Bharat-USA: బైడెన్‌ – మోడీ మధ్య ద్వైపాక్షిక చర్చలు

అగ్రరాజ్యాధినేత జోబైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీఅయ్యారు. భారత్ ఆతిధ్యమిస్తున్న జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ విచ్చేసిన అమెరికా అధ్యక్షడు జోబైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య సుధీర్ఘ చర్చ సాగింది. జీ20 సమావేశాల ప్రధానాంశాలతోపాటు ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. హైటెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇందనం, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై చర్చలు సాగాయి. హైటెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇందనం, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం.

ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో కుదిరిన ఒప్పందాల పురోగతిపైనా చర్చించినట్టు తెలిసింది. ఈ భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ 7లోకి బైడెన్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బైడెన్‌తో సమావేశం చాలా ఫలప్రదంగా సాగినట్టు పేర్కొన్నారు. తామిద్దరి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయని.. ఇరు దేశాల ఆర్థిక, ప్రజా సంబంధాలపై చర్చలు జరిపినట్టు మోదీ తెలిపారు.

శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనలో కలిసి పనిచేసేందుకు ముందస్తుగానే ఒప్పందం జరిగింది. వీటితో పాటు సెమీ కండక్టర్ల పరిశోధన, భవిష్యత్తు తరం కమ్యూనికేషన్‌ వ్యవస్థపై సహకారం, సైబర్‌ సెక్యూరిటీ, రవాణా వ్యవస్థ, గ్రీన్‌ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. హైటెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, శుద్ధ ఇందనం, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం తదితర అంశాలపై భేటీలో చర్చకు వచ్చాయి. భారత్- అమెరికా మధ్య ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలను మరింతగా పెంచే అంశాలపై చర్చించినట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య స్నేహం ప్రపంచానికి మేలు చేయడంలో కీలక పాత్ర పోషించే దిశగా కృషి జరుగుతుందని మోదీ అభిలషించారు. ఈ సందర్భంగా అమెరికా, భారత్‌ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్