DR Rajasekhar Father Varadarajan Gopal Died After Ill Health :
హీరో డా.రాజశేఖర్‌కి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్ గోపాల్ (93) గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వరదరాజన్ గోపాల్ చెన్పై డీసీపీగా రిటైర్ అయ్యారు. ఆయనకు అయిదగురు సంతానం. ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. హీరో రాజశేఖర్, వరదరాజన్ గోపాల్‌కు రెండో సంతానం. శుక్రవారం ఉదయం 6.30 నిమిషాలకు వరదరాజన్ గోపాల్ భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలోచెన్నైకు తీసుకెళ్ళారు. నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Must Read :సిటీ బస్సు ఎక్కిన సీఎం స్టాలిన్