Saturday, February 22, 2025
Homeసినిమాడ్రీమ్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి

డ్రీమ్ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి

Dream Project: ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీతో మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ నుంచి కూడా రాజ‌మౌళి ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు అంటే.. ఆర్ఆర్ఆర్ ఎంత‌గా ఆక‌ట్టుకుందో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో రాజ‌మౌళి నెక్ట్స్ మూవీ గురించి ఇండియాలోనే కాదు హాలీవుడ్ లో సైతం ఆస‌క్తి నెల‌కొంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి క‌థాచ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కే.ఎల్. నారాయణ ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించనున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. రాజ‌మౌళి త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ మ‌హా భార‌తం అని ఎప్పుడో చెప్పారు. ఆయ‌న అలా చెప్పిన‌ప్ప‌టి నుంచి రాజ‌మౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మ‌హా భార‌తాన్ని ఎప్పుడు తీస్తారు అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు సినీ జ‌నాలు. అయితే.. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా రాజ‌మౌళి మాట్లాడుతూ.. తన కెరీర్ లో డ్రీమ్ ప్రాజక్ట్ అయిన మహాభారతం గురించి చెప్పుకొచ్చారు.

నిజానికి మహాభారతం అనేది ఒక మహాసముద్రం వంటిదని, అందులోకి అడుగుపెట్టేందుకు మరికొంత సమయం పడుతుందని తెలియ‌చేశారు రాజమౌళి. తనకి పురాణాలు, ఇతిహాసాల పై అపారమైన‌ గౌరవం ఉందన్నారు. అయితే.. మహాభారతాన్ని తీయడానికి  ఇంకా మూడు, నాలుగు సినిమాలు చేసిన త‌ర్వాత‌ సాధ్యం అవుతుందని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దీనిని బట్టి  రాజమౌళి తన డ్రీమ్ ప్రాజక్ట్ తీయడానికి దాదాపుగా పదేళ్లు పెట్టే అవకాశం ఉంది. ఈవిధంగా డ్రీమ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చారు జ‌క్క‌న్న‌.

Also Read : మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీలో సాహో హీరోయిన్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్