కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని హనుమాన్ టెంపుల్ నుండి గీతా మందిర్ వరకు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో హుజూరాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా సంఘీభావ ర్యాలీ,గీతా మందిర్ ఫంక్షన్ హాల్ లో ఆశీర్వద ర్యాలీ, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, ముఠా గోపాల్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, పాల్గొన్నారు.
ఈ సభలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గంగపుత్రులు ఏకగ్రీవ తీర్మాణం చేసి, తెరాస అభ్యర్థి ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ. 25,116 అందజేసిన గంగ పుత్రులు సంఘం సభ్యులు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను సీఎం కేసీఆర్ ఆశీర్వదించి పంపిన ఉద్యమ బిడ్డ అని గతంలో ఏ ప్రభుత్వాలైనా ప్రజలను, ప్రజల సమస్యలను పట్టించుకున్నాయా అని ప్రశ్నించారు.
టిఆర్ఎస్ అంటేనే ప్రజలు.. ప్రజలు అంటేనే టిఆర్ఎస్ అన్న మంత్రి మట్టిబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలవాల్సిన అవసరం ఉంది, కేసులు, లాఠీ దెబ్బలకు భయపడని బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆనాడు సీఎం కెసిఆర్ గారు అవకాశం ఇస్తేనే ఈటల స్థాయి పెరిగింది. ఒక ఎకరం అమ్మితే ఎన్నికల్లో గెలుస్తానన్న వ్యక్తి ఈటల రాజేందర్ అని అభ్యర్థి డబ్బులు ఇచ్చే పరిస్థితి నుంచి అభ్యర్థికి మీరు డబ్బులు ఇవ్వడం శుభపరిణామం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చెప్పుకోదగ్గ ఒక్క పథకమైనా అమలు చేస్తుందా అన్న మంత్రి వ్యక్తి కాదు.. వ్యవస్థ ముఖ్యం అన్నారు. ఈటల రాజేందర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏం చేయలేదు.. ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ దుయ్యబట్టారు.