Sunday, January 19, 2025
Homeసినిమాదుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కొత’

దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కొత’

దుల్కర్ సల్మాన్ సినీ పరిశ్రమలో విజయవంతంగా 11 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్త’ 2023 ఓనం రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రం సెకండ్ లుక్ పోస్టర్ ఇప్పటికే అభిమానులలో సందడి చేస్తోంది. అతని తొలి చిత్రం ‘సెకండ్ షో’లో అందరూ ఇష్టపడే గెటప్ లాగానే, అభిలాష్ జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ రగ్డ్ లుక్ ఈ పోస్టర్‌లో అలరిస్తోంది. జీ స్టూడియోస్‌, వేఫేరర్‌ ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘కింగ్‌ ఆఫ్‌ కొత’ చిత్రం షూటింగ్‌ తమిళనాడులోని కరైకుడిలో జరుగుతోంది.

అభిలాష్ ఎన్ చంద్రన్ రాసిన ఈ చిత్రం పాన్-ఇండియన్ స్టార్ నెక్స్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రానికి నిమిష్ రవి సినిమాటోగ్రఫీ, ఎడిటర్ గా శ్యామ్ శశిధరన్ పని చేస్తుండగా.. జేక్స్ బిజోయ్, షాన్ రెహమాన్ కలసి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్, షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిలింస్ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించారు. మరి.. ఈ సినిమా తెలుగులో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్