హిమాలయాలను అనుకోని ఉన్న ప్రాంతాల్లో… ఉత్తర భారతదేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గతవారం ఢిల్లీ సహా దాని పరిసర ప్రాంతాల్లో రెండు సార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే. హిమాలయాల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్ పీర్ పంజాల్ కనుమల వరకు గత పది రోజులుగా ప్రతి రోజు భుప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 3.42 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
అమృత్‌సర్‌కు నైరుతీ దిశలో 145 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూకంప కేంద్రం పాకిస్తాన్ – భారత్ సరిహద్దుల్లో ఉందని ప్రాథమిక సమాచారం. అయితే భుప్రకంపనలకు అమృతసర్ నగరంలో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణనష్టం జరగలేదని.. ఆస్థి నష్టం వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. భూ అంతర్భాగంలో 120 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది.