Sunday, January 19, 2025
HomeTrending Newsఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందికి ఈసీ ఓకే

ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బందికి ఈసీ ఓకే

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవలను వినియోగించుకునేందుకు అభ్యంతరం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే వారికి ప్రధాన ఎన్నికల విధులు అప్పగించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారికి సూచించింది. కేవలం ఓటర్ల చేతికి ఇంకు మార్క్ వేయడం లాంటి పనులుకు మాత్రమే సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని పేర్కొంది.  కాగా, గ్రామ/వార్డు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో వాడకూడదని, వారిని పోలింగ్ ఏజెంట్ గా కూడా అనుమతించకూడదని ఆదేశించింది. ప్రతీ పోలింగ్ పార్టీలోనూ రెగ్యులర్ సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని, బీఎల్‌వోలుగా పనిచేసిన సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని తెలిపింది.

ఎన్నికల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సేవలు వినియోగించుకోకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్రంలోని విపక్ష పార్టీలు గత నెలలో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి విజ్ఞప్తి చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో సహా పలు పార్టీలకు చెందిన నేతలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. దీనిపై పరిశీలించిన ఈసీ  నేడు తమ ఉత్తర్వులు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్