Sunday, January 19, 2025
HomeTrending Newsపైలెట్ రోహిత్ రెడ్డికి ఈడి నోటీసులు

పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడి నోటీసులు

బెంగళూరు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19 న హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. త‌న‌కు నోటీసులు జారీ అయిన విష‌యాన్ని రోహిత్ రెడ్డి ధృవీక‌రించారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డి హస్తం ఉందని మూడు రోజుల క్రితం బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో నోటీసులు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈడి నోటీసులపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి స్పందించారు. ” నాకు ఈడి నుంచి నోటీసులు వచ్చాయి. కానీ నేను ఇంకా ఆ నోటీసులు చూడలేదు. ఏ కేసులో అన్నది నోటీసులలో లేదు. అసలు ఏ కేసులో ఈడి నోటీసులు ఇచ్చింది అనే విషయం తెలియదు. నా బిజినెస్, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలు అడిగారు. ఈడీ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా ” అన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. మరోవైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్