Sunday, January 19, 2025
HomeTrending Newsకరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు...టార్గెట్ మంత్రి గంగుల

కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు…టార్గెట్ మంత్రి గంగుల

హైదరాబాద్, కరీంనగర్‌లో ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తోన్నాయి. మైనింగ్ అక్రమాలపై జాయింట్ ఆపరేషన్ చేపట్టిన ఈడీ, ఐటీ అధికారులు.. 30 బృందాలుగా విడిపోయి 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ కంపెనీలతో పాటు గ్రానైట్ కంపెనీల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, కార్యాలయాలు, గ్రానైట్ కంపెనీలలో కూడా ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో ఉన్న గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్, మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్‌లో తనిఖీలు జరుగుతోన్నట్లు సమాచారం.

గంగుల కమలాకర్‌తో పాటు గంగుల వెంకన్న, సుధాకర్, బోనాల రాజేశం, పొన్నంనేని గంగాధర్ రావు ఇళ్లల్లో సోదాలు జరుగుతోన్నాయి. గంగాధర్ రావు అనే వ్యక్తి ఓ రాజకీయ నాయకుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 2011-13 మధ్య కాలంలో గ్రానైట్ అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. అనుమతులు తీసుకోకుండా గ్రానైట్స్‌ను విదేశాలకు ట్రాన్స్‌పోర్ట్ చేశారని, దీని వల్ల ప్రభుత్వానికి రూ.750 కోట్ల నష్టం జరిగిందని ఫిర్యాదులు అందాయి. కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా గ్రానైట్ ఎక్స్‌పోర్ట్ చేసినట్లు గతంలో సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేశాయి. ఇప్పటికే ఈ కేసులో గ్రానైట్ వ్యాపారులను అధికారులు ప్రశ్నించారు.
ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో గతంలో 8 గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ కంపెనీలకు కూడా అప్పట్లో ఈడీ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా గ్రానైట్ కంపెనీల అక్రమాలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌, కరీంనగర్‌ లలోని మొత్తం 9 గ్రానైడ్‌ కంపెనీల్లో ఈడీ, ఐటీ సోదాలు.

శ్వేత ఏజెన్సీస్‌, ఏఎస్‌ షిప్పింగ్‌, జెఎం, బ్యాక్‌సీ&కంపెనీ..
మైథాలీ ఆధిత్య ట్రాన్స్‌పోర్టు, కేవీకే ఎనర్జీ, అరవిందా గ్రానైట్స్‌..
సైండియా ఏజెన్సీస్‌, పీఎస్‌ఆర్‌ ఏజెన్సీస్‌, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్‌లో సోదాలు
2011-13 మధ్య కాలంలో గ్రానైట్‌ అక్రమాలపై ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వానికి రూ.750 కోట్లు నష్టం జరిగినట్లు ఫిర్యాదులు రాగా కాకినాడ ద్వారా గ్రానైట్‌ను ఎక్స్‌పోర్ట్‌ చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు సీబీఐ, ఈడీ కేసులు నమోదు అయ్యాయి. గతంలోనే గ్రానైట్‌ వ్యాపారులను ప్రశ్నించిన ఈడీ, సీబీఐ, గ్రానైట్‌ రవాణా అక్రమాలపై నిగ్గు తేలుస్తున్న అధికారులు

RELATED ARTICLES

Most Popular

న్యూస్