Sunday, September 8, 2024
HomeTrending Newsఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై ఈసీ వేటు

ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై ఈసీ వేటు

రాష్ట్రంలో ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక రేంజ్ ఐజి తో సహా ఆరుగురు ఐపీఎస్ అధికారులను విధులనుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న చిలకలూరిపేట బహిరంగ సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరిపిన ఈసీ… గుంటూరు రేంజ్ IG పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను విధులనుంచి తప్పించింది.

ప్రకాశం జిల్లాలో జరిగిన టిడిపి కార్యకర్త  మునియ్య హత్య విషయంలో విచారణ జరిపిన ఈసీ… ⁠ఆ జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకుంది.  వీరితో పాటు చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ కె.తిరుమలేశ్వర్ లపై కూడా వేటు వేసింది.

ముగ్గురు ఐఏఎస్ అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. కృష్ణా, చిత్తూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లు రాజాబాబు, లక్ష్మీ షా, గౌతమిలను వెంటనే విధులనుంచి తప్పుకోవాలని ఆదేశించింది.

⁠బదిలీ అయిన అధికారులు తక్షణం  తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని,  ⁠బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎలాంటి ఎన్నికల విధుల్లో ఉండకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.  ⁠సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్