ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా 48 గంటల నిషేదం విధిస్తూ ఈ రోజు ఆదేశాలు జారీ చేసింది. తెరాస పార్టీకి ఓటు వేయకపోతే పెన్షన్లు ఆపేస్తామని వివాదాస్పద ప్రసంగం చేశారని మంత్రి పై ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందాయి.
మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని నిర్ధారించిన కేంద్ర ఎన్నికల సంఘం. ఓటర్లను బెదిరించే విధంగా ప్రసంగాలు చేశారన్న ఈసీ. ఈ నిషేధం ఈరోజు రాత్రి 7 గంటల నుంచి అమల్లోకి వస్తుంది.