Sunday, January 19, 2025
Homeఅంతర్జాతీయంకిటికీ పక్క సీటే కావాలి!

కిటికీ పక్క సీటే కావాలి!

ఇంటర్వ్యూ జరుగుతోంది. అభ్యర్థిని చివరి ప్రశ్నగా ఈ ఉద్యోగం నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడిగారు. కిటికీ పక్క సీట్ అని బదులిచ్చాడా అభ్యర్థి. వెంటనే అతని ఉద్యోగం ఖాయమైంది. ఇదేదో సినిమాలో సీన్ కాదు.  రానున్న రోజుల్లో నిజంగానే చూస్తామంటున్నారు నిపుణులు.  కిటికీలతో అనుబంధం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. క్లాస్ రూములో కిటికీ పక్కన కూర్చుని బయట ఏం జరుగుతోందో చూసే పిల్లలది ఒక రకం.

బస్టాండ్ లో ఎక్కాల్సిన బస్ రాగానే ముందు కిటికీ లో నుంచి కావలసిన సీట్లో టవల్ వేసేవాళ్ళుఇంకో రకం. ఏదన్నా హోటల్ కి వెళ్ళినపుడు గవాక్షాలగుండా చూస్తూ తినడానికి ఇష్టపడే వారు ఇంకో రకం.  మరి కొంతమందికి ఇళ్లల్లో కిటికీలే టీవీలు. ముందు ముందు ఆఫీసుల్లోనూ కిటికీ లకు డిమాండ్ పెరుగుతుందని నిపుణుల అభిప్రాయం. ఇందుకు సంబంధించి లండన్ లో జరిగిన సర్వేలో వెల్లడైన ఆసక్తి కరమైన అంశాలు …

  • కిటికీ పక్కన కూర్చుని పనిచేసేవారు చురుకుగా, సృజనాత్మకంగా ఉంటున్నారట
  • ఏకాగ్రత, పనిమీదే ధ్యాస పెరిగిందట
  • 51 శాతం మందిలో కళ్ళ అలసట తగ్గింది
  • 63 శాతం ఉద్యోగులకు టెన్షన్, తలనొప్పి తగ్గింది
  • సహజమైన వెలుతురు వల్ల ఉద్యోగులలో శక్తి సామర్థ్యాలు పెరిగాయట
  • చీకటి గదుల్లో కునికిపాట్లు పడుతూ పనిచేయడం చూస్తూనే ఉంటాం. అదే చిన్న రూమ్ అయినా సహజమైన వెలుతురు ఉంటే నిద్రావస్థలు కూడా 56 శాతం తగ్గుతాయంటున్నారు

లండన్ మాటేమో గానీ మన దేశంలో అయితే పెద్ద ఆఫీసులు, చిన్న కిటికీలు, చుట్టూ ఫైళ్లు, నిద్రా భారంలో ఉద్యోగులు…ఇవీ మనకు తెలిసిన ప్రభుత్వాఫీసులు. అంతేనా! గోడలు మెట్ల నిండా కిళ్ళీ మరకలు, కాంటీన్లో టీ, సిగరెట్లు ఊదేస్తూ ఆఫీసు పని తప్ప ప్రపంచ రాజకీయాలన్నీ చర్చించే వాళ్ళూ ఎక్కువే. మధ్య మధ్య ఆఫీస్ సీట్ లోకి తొంగిచూసి మళ్ళా బయటకి వెళ్ళిపోతూ ఉంటారు. ముందుగా ప్రభుత్వ కార్యాలయాల రూపురేఖలు మార్చేస్తే ప్రజలకు మేలేమో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్