Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో డ్రగ్స్ మాఫియా -బిజెపి

తెలంగాణలో డ్రగ్స్ మాఫియా -బిజెపి

Trs Regime : తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. ఈ అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. టీఆర్ఎస్ పాలనను అంతం చేసేందుకు ఇదే ఆఖరి పోరాటం కావాలని, అందుకోసం బీజేపీ చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా అండగా నిలిచారన్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోపాటు బీజేపీ గెలుపు కోసం తమవంతు క్రుషి చేయాలని బండి సంజయ్ కుమార్ పిలుపు ఇచ్చారు.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత బూడిద భిక్షమయ్య గౌడ్ సహా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఈరోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. భిక్షమయ్య కు తరుణ్ చుగ్ కాషాయం కండువా కప్పి పార్టీ సభ్యత్వం అందజేశారు. తరుణ్ చుగ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తరుణ్ చుగ్, బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్, పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలు సంకినేని వెంకటేశ్వర్ రావు, శ్యాంసుందర్, దాసరి మల్లేశం తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యంశాలు….

తెలంగాణలో అరాచక, కుటుంబ, అవినీతి పాలన సాగుతోంది. ప్రజల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. బీజేపీ పోరాటాలను ప్రజలు గుర్తిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఫ్రజల ముందున్న లక్ష్యం కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనను అంతం చేయడమే. ఇందుకోసం బీజేపీ చేస్తున్న పోరాటాలకు ప్రజలు అండగా ఉన్నారు.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏం తప్పు చేశారని ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు? (మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా..) తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తోంది టీఆర్ఎస్ నేతలే. సీఎం నోటి నుండి వచ్చిన హామీలేవీ నెరవేరలేదు. ఆయన ఏం హామీలిచ్చారో ప్రగతి భవన్ ముందు ప్రొజెక్టర్ పెట్టి చూపాలి. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వ నాశనం చేసిండ్రు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఆయనవల్ల తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నరు. ధాన్యం కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కొనుగోలు కేంద్రాలు పెట్టాలని చెబుతున్నా వినకుండా రాజకీయం చేస్తున్నరు. కొడుకు సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటుంటే…. కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అంటూ ప్రజల ద్రుష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నరు.

రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. దీని గురించి సీఎం ఎందుకు స్పందించడం లేదు. డ్రగ్స్ విషయంలోనూ కఠిన చర్యలేవి? మొక్కుబడిగా సమావేశాలు పెట్టి హడావుడి చేయడం తప్ప సమస్యను పరిష్కరించిన దాఖాలాల్లేవు. ప్రజల చర్చలను దారి మళ్లించేందుకే ధాన్యం పేరుతో నాటకాలు. జంతర్ మంతర్ కాదు కదా (మీడియా అడిగిన ప్రశ్నకు)…. టీఆర్ఎస్ నేతలు విదేశాల్లో ధర్నాలు చేసుకున్నా వచ్చే ఇబ్బందేమీ లేదు. అయినా మేం ధాన్యం కొనబోం అని చెబితే కదా…. కేంద్రం ఎంత రారైస్ ఇచ్చినా కొనేందుకైనా సిద్ధంగా ఉంది. పీయూల్ గోయల్ కూడా పార్లమెంట్ లో ప్రకటించారు కదా.

కానీ ధాన్యం పూటకోమాట చెబుతూ నాటకాలాడుతోంది కేసీఆరే, టీఆర్ఎస్ నేతలే… వరి పంట వేయాలని చెప్పేది వాళ్లే… సన్న వడ్లు వేయాలని చెప్పింది వాళ్లే. ఆ తరువాత మాట మార్చి వరి వేస్తే ఉరే గతి అన్నది వాళ్లే… ధాన్యం కేంద్రానికి పంపేది లేదని చెబుతోంది వాళ్లే… ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తామని చెప్పింది వాళ్లే. ఇప్పుడు కేంద్రమే కొనాలంటూ గోల చేస్తోంది వాళ్లే. కరెంట్ బిల్లుల విషయంలో ప్రజలను దారి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి డ్రామాలాడుతున్నరు.

Also Read : మా పిల్లలు బంగారం

RELATED ARTICLES

Most Popular

న్యూస్